రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహీతకు MP సన్మానం

ADB: ఆదిలాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల హిందీ జూనియర్ లెక్చరర్ సూరజ్ రాష్ట్ర ఉత్తమ లెక్చరర్ సీఎం చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఆయన మథుర లబానా సమాజానికి గర్వకారణమని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. శనివారం ఆయన సూరజ్‌ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. సూరజ్‌ను చూసి తమ జాతి గర్విస్తోందని ఎంపీ పేర్కొన్నారు.