యర్రా శ్రీకాంత్ గుండెపోటుతో మృతి

ఖమ్మం: సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు యర్రా శ్రీకాంత్(62) గుండెపోటుతో మృతి చెందారు. తమిళనాడు రాష్ట్రం మధురైలో జరుగుతున్న పార్టీ అఖిల భారత మహాసభలకు వెళ్లిన ఆయన అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. శ్రీకాంత్ భౌతికకాయాన్ని మధురై నుంచి ఖమ్మంకు సోమవారం తీసుకొస్తారని అన్నారు.