చౌరస్తా అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి
హనుమకొండ జిల్లా ఎలుక తుర్తి మండల కేంద్రంలో రూ.4.39 కోట్ల వ్యయంతో సర్వాంగ సుందరంగా నిర్మించిన జంక్షన్‌ను రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం రాత్రి ప్రారంభించారు. కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ నిధుల నుంచి చౌరస్తా అభివృద్ధి చేసినట్లు మంత్రి ప్రకటించారు. కూడా ఛైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి, కలెక్టర్ స్నేహ శబరీష్ పాల్గొన్నారు.