రైతుల సమస్యలు పరిష్కరించాలని వినతి
SRD: కొండాపూర్ మండలం మునిదేవుని పల్లి గ్రామంలో సర్వేనెంబర్ 92లో టీజీఐఐసీ కింద భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌కు శుక్రవారం వినతి పత్రం సమర్పించారు. రైతులకు నష్టపరిహారం ఇచ్చిన తర్వాతే సర్వే చేయాలని కోరారు. రైతుల సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.