స్వయంగా గుంతలు పూడ్చిన ఎమ్మెల్యే గల్లా మాధవి
GNTR: దర్గా రోడ్డులో నెలలుగా ఉన్న గుంతలను కార్పొరేషన్ అధికారులు పట్టించుకోకపోవడంపై ఎమ్మెల్యే గల్లా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల స్పందన లేకపోవడంతో ఎమ్మెల్యే స్వయంగా రోడ్డుపైకి వచ్చి గుంతలు పూడ్చే పనిని ప్రారంభించారు. గుంతలతో ప్రతిరోజూ ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఎమ్మెల్యే చర్యను అభినందించారు.