టిఫిన్ బండికి నిప్పు పెట్టిన దుండగులు

కృష్ణా: ఉయ్యూరు ఉర్దూ స్కూల్ సమీపంలో టిఫిన్ బండికి గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం అర్ధరాత్రి పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. మంటలు ఎగసిపడడంతో గ్యాస్ బండ ఒక్కసారిగా పేలిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అక్కడి వారు మంటలను అదుపులోకి తెచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.