63 మంది పోలీసు సిబ్బంది బదిలీ

63 మంది పోలీసు సిబ్బంది బదిలీ

BHPL: సాధారణ బదిలీల్లో భాగంగా 63 మంది పోలీసు సిబ్బందినీ బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒక పోలీసు స్టేషన్లో ఐదు సంవత్సరాలు పనిచేసిన సిబ్బందికి స్థానచలనం కల్పించారు. సీనియారిటీ ప్రకారం పోలీసు స్టేషన్లను కేటాయించారు. ASI -2, హెడ్ కానిస్టేబుళ్లు -2, మహిళా కానిస్టేబుళ్లు -7, కానిస్టేబుళ్లు 52 ఉన్నారు.