నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
SKLM: మందస మండలం హరి పురం 33/11 కేవీ సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ మరమ్మతులు చేపడుతున్నందున బుధవారం విద్యుత్ సరఫరాను నిలిపి వేస్తున్నట్టు పలాస ఈఈ యజ్ఞేశ్వర రావు మంగళవారం ప్రకటనలో తెలిపారు. బీ.ఎం.పు రం, భేతాళపురం, బహడపల్లి, నారాయణ పురం, తదితర గ్రామాలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరాను నిలిపి వేస్తామన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.