అరుదైన A3 బ్లడ్‌ గ్రూప్‌ గుర్తింపు

అరుదైన A3 బ్లడ్‌ గ్రూప్‌ గుర్తింపు

యూపీ గోరఖ్‌పూర్ ఎయిమ్స్ డాక్లర్లు 'A' గ్రూప్ రక్తంలోని అరుదైన 'A3' బ్లడ్ సబ్ గ్రూప్‌ను గుర్తించారు. 8 నెలల గర్భిణీ శరీరంలో గుర్తించినట్లు చెప్పారు. సాధారణ చెకప్‌లో భాగంగా గర్భిణీకి పరీక్షలు చేస్తుండగా.. రక్తంలో తేడా కనిపించడంతో పరీక్షించారు. దీంతో అరుదైన 'A3' సబ్‌గ్రూప్‌ను నిర్ధారించారు. భారత్‌లో 33 వేల మందిలో ఒకరికి ఈ రకమైన రక్తం ఉన్నట్లు అంచనా.