అక్రమ ఇసుక ట్రాక్టర్ సీజ్.. కేసు నమోదు

అక్రమ ఇసుక ట్రాక్టర్ సీజ్.. కేసు నమోదు

SRPT: మండలంలోని ముకుందాపురం పాలేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను గురువారం ఎస్సై వీరన్న పట్టుకున్నారు. ముకుందాపురానికి చెందిన బూదరపు ఉపేందర్ అక్రమంగా ఇసుక తరలిస్తుండగా పట్టుబడ్డాడు. నిందితుడిపై కేసు నమోదు చేశామని, ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు.