కరెంట్ బిల్లులు చెల్లించండి...!

కరెంట్ బిల్లులు చెల్లించండి...!

కృష్ణా: ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో ప్రజలు ఫిబ్రవరి నెలకు సంబంధించిన కరెంట్ బిల్లును ఆఖరి గడువు లోపు తప్పనిసరిగా చెల్లించాలని విద్యుత్ శాఖ అధికారులు సూచించారు. ఈ మేరకు సైకిల్ ద్వారా ప్రకటనలు నిర్వహించారు. గడువు ముగిసిన తర్వాత బిల్లు చెల్లించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యుత్ సిబ్బంది హెచ్చరించారు.