పాఠశాలలో సందడి చేసిన ప్రముఖ సినీ నటుడు

పాఠశాలలో సందడి చేసిన ప్రముఖ సినీ నటుడు

మన్యం జిల్లా సీలేరులోని బాలికల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ప్రముఖ సినీ నటుడు సాయికుమార్ శుక్రవారం సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలని సూచించారు. అలాగే తాను డాక్టర్‌ అవ్వాలనుకుని నటుడయ్యానని పేర్కొన్నారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తెలిపారు.