మహిళా స్వయం సహాయక సంఘాలతో స్టాల్స్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాలిక' కార్యక్రమంలో భాగంగా 'హ్యాపీ సండే' పేరుతో మహిళా సంఘాలకు ఉత్సాహాన్నిచ్చేలా పాటలు, డాన్సులు, ఫుడ్, డెకరేషన్, ఫాన్సీ స్టాల్స్‌ను నగరపాలక సంస్థ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ హాజరై స్టాల్స్‌లో వస్తువులు కొనుగోలు చేసి మహిళా సంఘాలకు ప్రోత్సాహాన్ని అందించారు.