ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సన్మానం
ATP: గుత్తిలోని ఏపీ మోడల్ స్కూలులో ఇవాళ స్కూల్ ఛైర్మన్ పవన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. విద్యార్థులకు శాలువా కప్పి బహుమతులు అందజేశారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. జిల్లాలోని గుత్తి మోడల్ స్కూల్ మొదటి స్థానంలో నిలిచిందని వారు పేర్కొన్నారు.