పశ్చిమ ప్రాంత సమగ్ర అభివృద్ధికి కృషి

పశ్చిమ ప్రాంత సమగ్ర అభివృద్ధికి కృషి

NLR: జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి మూడు నెలలు పూర్తయిన సందర్భంగా, మంగళవారం కలెక్టరేట్‌లో పాత్రికేయులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, జిల్లాలోని సమస్యలను పరిష్కరిస్తూ, పశ్చిమ మెట్ట ప్రాంత సమగ్రాభివృద్ధికి ప్రణాళికాబద్దంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుపై కూడా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు.