జిల్లాలోని పాఠశాలలు తనిఖీ చేయండి: కలెక్టర్

జిల్లాలోని పాఠశాలలు తనిఖీ చేయండి: కలెక్టర్

SRD: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు గురుకులాలు, వసతి గృహాలను తనిఖీ చేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. లింగంపల్లి గురుకుల పాఠశాల లాంటిఘటనలు మరోసారి జరగకుండా చూడాలని చెప్పారు. ఇదిలావస్థలో ఉన్న పాఠశాల భవనాల నివేదికను వెంటనే సమర్పించాలని ఆదేశించారు.