ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

ELR: మనస్తాపంతో ఓ వివాహిత నిన్న ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పోలవరంలో చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేకపోతున్నామని, ఇక్కడ వ్యాపార లావాదేవీలు లేవని, రాజమండ్రి వెళ్లిపోదామని కిలపర్తి విజయ (40) భర్త శేఖర్‌తో ఇటీవల వాగ్వాదం చేసింది. అనంతరం మనస్థాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.