మాజీ సర్పంచులు పెండింగు బిల్లులపై ఆందోళన
NRPT: కొత్తపల్లి మండలంలోని వివిధ గ్రామాల మాజీ సర్పంచులు పెండింగ్లో ఉన్న విద్యుత్, జలబిల్లులను వెంటనే చెల్లించాలని కోరుతూ మంగళవారం MPDOకు వినతి పత్రం సమర్పించారు. ఎంపీడీవో సానుకూల స్పందనతో ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.