కష్టాల్లో ఉన్న సాలమ్మకు ఉదయగిరి ఎమ్మెల్యే భరోసా
NLR: సింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ముంత. సాలమ్మ పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యారు. విషయం తెలిసిన వెంటనే ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆమెను పరామర్శించి, కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరపున రూ.20,000, సీతారామపురం మండల కన్వీనర్ చింతల శ్రీనివాసులు 5000 తక్షణ ఆర్థిక సహాయం అందజేశారు. అర్హత మేర పెన్షన్‌తో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తానని భరోసా ఇచ్చారు.