VIDEO: డ్రోన్లతో ముమ్మరంగా తనిఖీలు

VIDEO: డ్రోన్లతో ముమ్మరంగా తనిఖీలు

ASR: గంజాయి నిర్మూలనకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు డుంబ్రిగుడ ఎస్సై కే.పాపినాయుడు తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం అరమ, జాకరవలస గ్రామాల్లో పోలీసు, అటవీశాఖ, వ్యవసాయ, పంచాయతీ రాజ్ ఈగిల్ టీమ్ తదితరులతో కలిసి పర్యటించారు. డ్రోన్లు ఎగరవేసి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించామని ఎస్సై తెలిపారు. గంజాయి సాగు, రవాణా చేయడం చట్టరీత్యా పెద్ద నేరమని చెప్పారు.