పెద్ద ఎక్లరాలో రేషన్ బియ్యం పంపిణీ

పెద్ద ఎక్లరాలో రేషన్ బియ్యం పంపిణీ

KMR: మద్నూర్ మండలం పెద్ద ఎక్లరా రేషన్ దుకాణాల్లో బియ్యం పంపిణీని శనివారం ఉదయం నుంచి ప్రారంభించారు. సన్న బియ్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసిన ఇందిరమ్మ బస్తాలు సైతం అందజేస్తున్నట్లు రేషన్ డీలర్ తెలిపారు. కాగా, బియ్యం తీసుకోవడానికి తెల్లవారుజామున నుంచే రేషన్ దుకాణాల వద్ద లబ్దిదారులు బారులు తీరారు. దీంతో రేషన్ దుకాణాల వద్ద జనాల సందడి నెలకొంది.