‘దీర్ఘకాలిక రోగులు అప్రమత్తంగా ఉండాలి’

NLR: ఉదయగిరి మండలంలో దీర్ఘకాలిక రోగులు మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యాధికారిణి శివకల్పన సూచించారు. ఆమె శనివారం మండలంలోని సున్నంవారిచింతల గ్రామంలో 104 వైద్య సేవలు అందించారు. 60 మందిని పరీక్షించి మందులు అందించారు. క్రమం తప్పకుండా మందులు వాడాలన్నారు. పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాలని సూచించారు.