'మున్సిపల్ కార్మికుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్న ప్రభుత్వం'

'మున్సిపల్ కార్మికుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్న ప్రభుత్వం'

KMM: మున్సిపల్ కార్మికుల ఆరోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ వహిస్తుందని ఎమ్మెల్యే మట్టా రాగమయి అన్నారు. గురువారం సత్తుపల్లి పురపాలక సంఘం ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే రైన్ కోట్స్‌లను పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వర్షాకాలంలో కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రైన్ కోట్స్‌లను అందజేయడం జరిగిందని పేర్కొన్నారు.