'చేపల పెంపకం ద్వారా యువతకు ఉపాధి'
PDPL: సింగరేణి కాలనీలో చేపల పెంపకం ద్వారా యువతకు ఉపాధి కల్పించాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. IDOCలో ఆయన ఇవాళ మత్స్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. బొగ్గు గనులు పూర్తయిన తర్వాత మిగిలిన చెరువును బొమ్మ చేపల పెంపకానికి వినియోగించాలన్నారు. తద్వారా 50 మందికి జీవనోపాధి కల్పించడమే లక్ష్యమని తెలిపారు. వచ్చే 20 రోజుల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలన్నారు.