యాడికిలో పంపు స్టోరేజ్ ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణ

ATP: యాడికి మండలంలోని రెండు గ్రామాలలో రేపు ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నట్లు తహశీల్దార్ ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. కుందనకోట, చింతలపల్లి గ్రామంలో పంపు స్టోరేజ్ ప్రాజెక్టుపై ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటామన్నారు. ఉదయం 11 గంటలకు గుంతకల్లు రెవెన్యూ డివిజన్ అధికారి శ్రీనివాసులు ఆధ్వర్యంలో రైతులు, ప్రజలతో కలిసి మాట్లాడతామని చెప్పారు.