రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులకు తీవ్ర గాయాలు
E.G: రాజానగరం మండలం దివాన్ చెరువు జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఇంటర్ పరీక్షలు ముగియడంతో స్నేహితులతో కలిసి ఫేర్‌వెల్ పార్టీ చేసుకుని కారులో తిరిగి వస్తుండగా వాహనం అదుపుతప్పి రహదారి డివైడర్‌ను ఢీకొట్టినట్లు సమాచారం. పోలీసులు సంఘటనా స్థలానికి పరిశీలించి కేసు నమోదు చేశారు.