అవనిగడ్డలో మాజీ మంత్రి శత జయంతి వేడుకలు
కృష్ణా: దివిసీమ పునర్నిర్మాత మండలి వెంకట కృష్ణారావు అని టీడీపీ జిల్లా సీనియర్ నేత యార్లగడ్డ శ్రీనివాసరావు అన్నారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, దివిసీమ గాంధీ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బుధవారం అవనిగడ్డ వంతెన సెంటర్లో కృష్ణారావు విగ్రహానికి చల్లపల్లి మండలం పాగోలు నేతలు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.