VIDEO: కోదండపురం వద్ద రోడ్డు ప్రమాదం
GDWL: ఎర్రవల్లి మండలం కోదండపురం గ్రామం వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో ఒక వాహనం అదుపుతప్పి రైల్వే లైన్ రక్షక కంచె పైనుంచి అవతలికి పడింది. ఈ ఘటనలో జరిగిన నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.