VIDEO: పుంగనూరులో తొలగించిన ఫ్లెక్సీలు

CTR: స్వచ్ఛ సర్వేక్షన్‌లో భాగంగా శుక్రవారం పుంగనూరులో ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు.. పట్టణంలో పలు ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా, డ్రైన్లపై ఉన్న వివిధ రకాల ఫ్లెక్సీలను తొలగించారు. ఇకపై పట్టణంలో ఫ్లెక్సీలు పెట్టాలంటే తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని చెప్పారు. లేనిపక్షంలో జరిమానా వేస్తామని హెచ్చరించారు.