నీరు లేక ఎండిపోతున్న చీమ పెండ్లం తోటలు

VZM: తెర్లాం మండలంలో లోచర్లలో చీమ పెండ్లమును రైతులు ప్రతి సంవత్సరం పండిస్తుంటారు. ఈ పంట వలన చాలా ఆదాయం వచ్చేదని, సంవత్సరం వర్షాలు పడకపోయినందున నూతులు, బోర్లు ద్వారా నీటిని తోటి పంటలను పండించేవారు. అయితే ఈ సంవత్సరం వర్షాలు పడకపోవడంతో నీరు లేక నూతులు ఎండి, బోర్లలో భూగర్భ జలాలు ఇంకుపోవడంతో బోరులో కూడా అడుగంటి పోయాయి. ఈ సంవత్సరం గ్రామంలో చీమ పెండ్లం, మరియు కూరగాయలు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తునారు.