ప్రమాదాల నివారణకు ఎస్సై చొరవ

ప్రమాదాల నివారణకు ఎస్సై చొరవ

MHBD: పెద్దవంగర మండలంలోని తొర్రూరు- వలిగొండ ప్రధాన రహదారిపై ఉన్న లోట్లబండ తండా ప్రాంతంలో దెబ్బతిన్న రోడ్డు వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గమనించిన ఎస్సై చిలువేరు ప్రమోద్ కుమార్ గౌడ్ స్వయంగా చొరవ తీసుకొని సిబ్బందితో కలిసి శుక్రవారం తారుతో గుంతలను పూడ్చి వేయించారు. దీంతో వాహనదారులు, ప్రజలు ఎస్సైకి కృతజ్ఞతలు తెలిపారు.