గుంతకల్లు యువకుడికి రూ.5 కోట్ల ప్యాకేజీతో కొలువు

ATP: గుంతకల్లుకు చెందిన సాయిసాకేత్ అనే యువకుడికి అమెరికాలోని ఆప్టివర్ సాఫ్ట్‌వేర్ సంస్థలో వార్షిక రూ.5 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం లభించింది. పది వారాల ఇంటర్న్ షిప్ కోసం రూ. కోటి వేతనం కూడా అందుతుంది. కోర్సు పూర్తయిన తర్వాత ఈ వార్షిక ప్యాకేజీని అందించడానికి కంపెనీ ప్రాథమికంగా ఒప్పందం కుదుర్చుకుంది. సాయి సాకేత్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుండగానే ఈ ఘనత సాధించాడు.