నూతన రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NGKL: ఊర్కోండ మండల కేంద్రంలో లబ్ధిదారులకు మంజూరైన నూతన రేషన్ కార్డులను ఎమ్మెల్యే జంనంపల్లి అనిరుద్ రెడ్డి మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. గత ప్రభుత్వంలో నాయకులే సంక్షేమ పథకాలు పొందారని, పేదలకు సంక్షేమ పథకాల అందించలేదని ఆయన విమర్శించారు.