3 నుంచి గుజ్జు పరిశ్రమల వద్ద ఆత్మీయ సమావేశాలు
CTR: ఈ నెల మూడు తేదీ నుంచి పరిశ్రమల యజమానుల ప్రతినిధులు-రైతుల ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నామని మామిడి రైతుల సంక్షేమ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరిబాబుచౌదరి, ఆనందనాయుడు శనివారం తెలిపారు.3న గుడిపాల మండలం లోని తాసా పరిశ్రమ వద్ద, 5న గంగాధరనెల్లూరు మండలం జైన్ పరిశ్రమ-1, 7న బంగారుపాళ్యం మండలంలోని సన్ గోల్డ్ పరిశ్రమ వద్ద నిర్వహిస్తామన్నారు.