ఎన్టీఆర్ దైవంతో సమానం: యనమల రామకృష్ణుడు
E.G: దివంగత నేత ఎన్టీఆర్ తనకు దైవంతో సమానమని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. తుని మండలం తేటగుంట పార్టీ ప్రధాన కార్యాలయంలో టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించి మాట్లాడారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్టీఆర్ పార్టీని స్థాపించారన్నారు. కేవలం 9నెలల్లోనే పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనత ఆయనకే దక్కిందని కొనియాడారు.