లీగల్ మెట్రాలజీ శాఖ అధికారుల ఆకస్మిక దాడులు

విజయనగరం: లీగల్ మెట్రాలజీ డిప్యూటీ కంట్రోలర్ బి.మధుసూదనరెడ్డి ఆధ్వర్యంలో చీపురుపల్లి మండలంలో అధికారులు రెండు బృందాలుగా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రైతుబజార్లు, సంతలు, ఎంఎల్ఎస్ పాయింట్లు, ఇతర వ్యాపార సంస్థలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. కాటాలకు సీళ్ళు లేకపోవడం, తూకంలో తేడాలు ఉన్నట్లు గుర్తించి 14 మంది వ్యాపారులపై కేసులు నమోదు చేశారు.