సాటి డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక సాయం

సాటి డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక సాయం

GDWL: జోగులాంబ గద్వాల జిల్లా అయిజకు చెందిన డ్రైవర్ వీరేష్ కొంతకాలం క్రితం ప్రమాదంలో మరణించగా, అయిజ పట్టణంలోని సాటి స్కూల్ డ్రైవర్లు కలిసికట్టుగా చందాలు వసూలు చేశారు. మానవతా దృక్పథంతో గురువారం వారు వీరేష్ కుటుంబ సభ్యులకు రూ. 36,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. వారు మాట్లాడుతూ.. సమస్య ఏదైన వస్తే కలిసికట్టుగా పోరాడాలి అన్నారు.