జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడిగా బోడ నరసింహ

నాగర్ కర్నూలు జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడిగా కల్వకుర్తి పట్టణానికి చెందిన బోడ నరసింహ నియమితులయ్యారు. ఇటీవల జిల్లా కేంద్రంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో జిల్లా నూతన కమిటీని ప్రకటించారు. పార్టీలో చురుగ్గా పనిచేస్తున్న నరసింహకు జిల్లా స్థాయిలో పదవి కేటాయించడం పట్ల ఆయన అనుచరులు హర్షం వ్యక్తం చేశారు.