జిల్లాలో శ్రీరామనవమి వేడుకలకు కట్టుదిట్టమైన భద్రత
CTR: శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా రామాలయాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. సీసీటీవీ, డ్రోన్ పర్యవేక్షణతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, క్యూ లైన్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు.