మృతులకు సీఎం ఎక్స్‌గ్రేషియా ప్రకటన
మధ్యప్రదేశ్ ఛింద్వాడాలో జరిగిన బస్సు ప్రమాదంలో 10 మంది మృతి చెందటంపై ఆ రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా మృతులకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. వీరంతా సీఎం సభకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.