వేదగిరి బ్రహ్మోత్సవాలు.. ఆర్డీవో కీలక ఆదేశాలు
NLR: వేదగిరి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై నెల్లూరు ఆర్డీవో నాగ అనూష శనివారం సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా తాగునీరు, నిరంతర విద్యుత్, పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణతో పాటు పోలీస్, ఆర్టీసీ శాఖలు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.