ఉమ్మడి జిల్లా యూత్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్‌గా తేజస్వి
PDPL: రామగుండం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్దెల్లి తేజస్విని ఉమ్మడి కరీంనగర్ జిల్లా యూత్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో యూత్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా నియామకానికి సహకరించిన వారికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.