VIDEO: వైన్ షాప్‌కు వ్యతిరేకంగా ధర్నా చేసిన కాలనీవాసులు
హన్మకొండ పట్టణంలోని అశోక కాలనీలో నివాసాల మధ్య వైన్ షాపులు ఏర్పాటుకు వ్యతిరేకంగా ఇవాళ కాలనీవాసులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ.. వడ్డేపల్లి చర్చి నుంచి ఫంక్షన్ హాల్ వరకు ఇప్పటికే 9 మద్యం దుకాణాలు ఉన్నాయని, మరో కొత్త షాపుకు అనుమతి రద్దు చేయాలని కోరారు. ఈ సమస్య పై అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.