'విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యం పెంపుకు కృషి చేయండి'

CTR: ప్రభుత్వ పాఠశాలలో విద్యానభ్యసిస్తున్న విద్యార్థులలో అభ్యసన సామర్థ్యం పెంపుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా సచివాలయంలో సమగ్ర శిక్ష ఏపీసీ వెంకట రమణతో కలిసి 5వ తరగతి విద్యార్థులలో మాతృభాష అయిన తెలుగు, గణితం, తదితర పాఠ్యాంశాలలో అభ్యసన సామర్థ్యాల పెంపుపై MEO, HMలతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.