చిట్టీల పేరుతో మోసం.. నిందితుడు అరెస్ట్
మహబూబాబాద్ పట్టణంలో చిట్టీల పేరుతో ప్రజలను మోసం చేసిన వ్యక్తిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేసినట్లు టౌన్ సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు. అజ్మీర హరిసింగ్ 2017లో తన భార్యతో కలిసి శ్రీమన్నారాయణ చిట్టి ఫండ్ పేరుతో సంస్థను ప్రారంభించాడు. అధిక లాభాలు వస్తాయని ఆశ చూపించి పలువురి నుంచి డబ్బులు సేకరించి మోసం చేసినట్లు బాధితుల ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు.