నేడు ఆది శంకరాచార్యుల ఉత్సవాలు

నేడు ఆది శంకరాచార్యుల ఉత్సవాలు

AKP: నర్సీపట్నం వైదిక బ్రాహ్మణ, పురోహిత అర్చక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం శ్రీ ఆదిశంకరాచార్యుల ఉత్సవాలు నిర్వహిస్తున్నామని సంఘ సభ్యులు పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి శంకర జయంతి పురస్కరించుకుని శ్రీ దుర్గా మల్లేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఉంటాయన్నారు. సాయంత్రం 6గంటలకు బాల వినాయకుని స్వామి ఆలయం నుంచి ఊరేగింపు ఉంటుందన్నారు.