రూ.35,57,807ల విలువైన చెక్కుల పంపిణీ
SS: ధర్మవరంలో 25 మంది లబ్ధిదారులకు రూ.35,57,807 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను మంత్రి సత్యకుమార్ కార్యాలయ ఇన్‌ఛార్జి హరీష్ బాబు మంగళవారం పంపిణీ చేశారు. పేదవారికి తక్షణ వైద్య సహాయం అందించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా భావిస్తున్నామని ఆయన తెలిపారు. సీఎం సహాయ నిధి పేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.