VIDEO: నీర్మాలలో బీఆర్ఎస్ నేతల ప్రచారం
JN: దేవరుప్పుల మండలం నీర్మాల గ్రామంలో బీఆర్ఎస్ నేతలు సోమవారం ప్రచారం చేశారు. ముఖ్య అతిథిగా జిల్లా నాయకులు పల్లా సుందర్ రాం రెడ్డి హాజరై మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి కోసం బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సర్పంచ్ అభ్యర్థి పల్లెర్ల సంధ్యా రాణినీ అధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. ఈ ప్రచారంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు భారీగా పాల్గొన్నారు.