సెక్రటేరియట్‌లో బ్యాటరీ వాహనాలు ప్రారంభం
HYD: తెలంగాణ సచివాలయంలో మహిళలు, వికలాంగుల సౌకర్యార్థం నూతనంగా బ్యాటరీ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. బుధవారం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, జనరల్ సెక్రటరీ ప్రేమ్ దేవేందర్ ఈ వాహనాలను ప్రారంభించారు. సచివాలయ ప్రాంగణం విస్తీర్ణం ఎక్కువగా ఉండటంతో ఉద్యోగులు, విభాగాల మధ్య ప్రయాణించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.