'ధర్మారం మండలంలో ఐటీఐ మంజూరు చేస్తాం'
PDPL: ధర్మారం మండలంలో ఐటీఐ మంజూరు చేస్తామని ఈ పనులు త్వరలో ప్రారంభమవుతాయని రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గిరిజన విద్యార్థులకు మౌలిక వసతుల కల్పనకు చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. బుధవారం ధర్మారం గిరిజన మినీ గురుకులంలో నిర్మించనున్న అదనపు తరగతుల పనులకు కలెక్టర్ కోయ శ్రీ హర్షతో కలిసి శంకుస్థాపన చేశారు.